అయ్యోపాపం.. ప్రాణం తీసిన పతంగి..రేకుల షెడ్‌‌‌‌‌‌‌‌ పైనుంచి జారి పడి బాలుడు మృతి

అయ్యోపాపం.. ప్రాణం తీసిన పతంగి..రేకుల షెడ్‌‌‌‌‌‌‌‌ పైనుంచి జారి పడి బాలుడు మృతి

శంషాబాద్, వెలుగు : పతంగి ఎగురవేసేందుకు రేకుల షెడ్‌‌‌‌‌‌‌‌పైకి ఎక్కిన బాలుడు ప్రమాదవశాత్తు కిందపడి చనిపోయాడు. ఈ ఘటన రాజేంద్రనగర్‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గ పరిధిలోని కాటేదాన్‌‌‌‌‌‌‌‌ సాయిబాబా నగర్‌‌‌‌‌‌‌‌ ఇండస్ట్రియల్‌‌‌‌‌‌‌‌ ఏరియాలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ఉప్పటాల మహేందర్, సుజాత దంపతులు కాటేదాన్‌‌‌‌‌‌‌‌ సాయిబాబానగర్‌‌‌‌‌‌‌‌ కాలనీలో ఉంటూ ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. వీరి కుమారుడు హేమంత్‌‌‌‌‌‌‌‌ (10) ఉన్నాడు.

సోమవారం ఉదయం హేమంత్‌‌‌‌‌‌‌‌ పతంగి ఎగురవేసేందుకు ఇంటిపైకి వెళ్లాడు. పతంగి ఎగురవేస్తూ ఇంటి పక్కనే ఉన్న ఓ కంపెనీ రేకుల షెడ్డుపైకి చేరుకున్నాడు. ఈ క్రమంలో ఓ ఫైబర్‌‌‌‌‌‌‌‌ రేకుపై కాలు వేయడంతో అది విరగడంతో హేమంత్‌‌‌‌‌‌‌‌ 20 ఫీట్ల పైనుంచి కిందపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే హేమంత్‌‌‌‌‌‌‌‌ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు బాలుడిని హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తీసుకెళ్లగా.. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు మైలార్‌‌‌‌‌‌‌‌దేవ్‌‌‌‌‌‌‌‌పల్లి పోలీసులు తెలిపారు.